రాష్ట్రంలో అమలు చేస్తున్న చాలా పథకాలకు కేంద్రం నిధులే వినియోగిస్తున్నారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ప్రజా సంక్షేమ పథకాల్లో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ పథకాలే ఉన్నాయన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర నిధులుగా నమ్మించి కెసిఆర్ ప్రజలను మోసం చేస్తున్నరని సంజయ్ ఆరోపించారు. బిజెపి కార్యకర్తలు చొరవ తీసుకొని, ప్రతీ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రంలో ఎన్ని అమలు అవుతున్నయో వెల్లడించాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు. కెసిఆర్ చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకొని ప్రజలకు వాస్తవలు చెప్పాలసిన బాధ్యత బిజెపి కార్యకర్తలపై ఉందన్నారు. ఏడెండ్లలో ఎన్నో సాహసోపేత నిర్ణయాలు మోడీ తీసుకున్నారని అసాధ్యం అనుకున్న పనుల్ని సుసాధ్యం చేసి మోడీ ప్రజామోదం పొందారన్నారు.