Sunday, January 19, 2025
HomeTrending Newsరాబోయేది బిజెపి ప్రభుత్వమే

రాబోయేది బిజెపి ప్రభుత్వమే

తెలంగాణలో మార్పు కోసం జరిగే పోరాటంలో ముందుండే పార్టీ బీజేపీ అని టీఆర్ఎస్ కు అసలు సిసలు ప్రత్యామ్నాయం బీజేపీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లో స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు తెలంగాణలో సరైన నాయకత్వం లేదని బయట వాళ్లకు ఆరేళ్లపాటు లీజుకిచ్చిన పార్టీ కాంగ్రెస్ అని సంజయ్ ఎద్దేవా చేశారు. పాదయాత్ర ద్వారా బీజేపీ తెలంగాణలో చరిత్ర స్రుష్టించబోతోందని కనీవినీ ఎరగని రీతిలో పాదయాత్ర ప్రారంభం కాబోతోందన్నారు.

జాతీయ నాయకత్వం, కేంద్ర మంత్రులు కూడా పాదయాత్రకు వచ్చి సంఘీభావం తెలపబోతున్నారని, పాదయాత్ర ద్వారా తెలంగాణలో పెనుమార్పులు రాబోతున్నాయన్నారు. రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలనతో క్షేత్ర స్థాయి కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకత్వంలో తెలంగాణలో పేదల సంక్షేమ ప్రభుత్వం రావడం తథ్యమన్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి చేపట్టబోయే ఆశీర్వాద యాత్రలో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని సంజయ్ పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్