Friday, October 18, 2024
HomeTrending Newsఏపీలో 'పొత్తు' పొడుపు – పార్లమెంట్ బరిలో పవన్!

ఏపీలో ‘పొత్తు’ పొడుపు – పార్లమెంట్ బరిలో పవన్!

మార్చి 14 న జరిగే ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సమావేశానికి హాజరు కావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది.  ఏపీలో బిజెపి-తెలుగుదేశం-జన సేన కూటమి పొత్తు ఖరారైంది. సీట్ల సర్దుబాటు కూడా పూర్తయ్యింది.

మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో….  తెలుగుదేశం 145; జనసేన 24; బిజెపి 6 సీట్లలో పోటీ చేయనున్నాయి

25 లోక్ సభ స్థానాల్లో తెలుగుదేశం 17; బిజెపి 6; జన సేన 2 సీట్లలో పోటీ చేసేలా ఒప్పందం కుదిరింది.

లోక్ సభ స్థానాల్లో  అరకు, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, రాజంపేట, తిరుపతి లేదా హిందూపురం సీట్లలో బిజెపి

కాకినాడ, నర్సాపురం స్థానాల్లో జనసేన పోటీ చేస్తాయి. మిగిలిన సీట్లలో టిడిపి బరిలోకి దిగుతుంది.

అయితే,  బిజెపి కేంద్ర పెద్దల సూచన మేరకు జన సేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నర్సాపురం సీటు  రఘురామకృష్ణమరాజుకు ఇచ్చే అవకాశాలున్నాయి.

అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి -సిఎం రమేష్; రాజమండ్రి -దగ్గుబాటి పురందేశ్వరి, ఏలూరు-సుజనా చౌదరి; రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హిందూపురం సీటు తీసుకుంటే సత్య కుమార్ లేదా విష్ణు వర్ధన్ రెడ్డి, తిరుపతి అయితే రత్నప్రభ లేదా ఆమె కుమార్తె నీహారిక పోటీ చేస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్