Saturday, November 23, 2024
HomeTrending Newsమోడీ, అమిత్ షా అరాచకాలకు భయపడం - తెరాస

మోడీ, అమిత్ షా అరాచకాలకు భయపడం – తెరాస

బీజేపీ రాజకీయ పార్టీలా కాదు రాబంధు పార్టీలా మారిందని టీ ఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ,పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి, టీ ఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్ లు ఈ రోజు టీ ఆర్ ఎస్ ఎల్ఫీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో బిజెపి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రత్యర్థులను వేధించడం లో అన్ని రికార్డులను కేంద్ర ప్రభుత్వం అధిగమించిందని, ప్రజాస్వామ్య0గా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూల్చి వేస్తోందని ఆరోపించారు. మోడీ అమిత్ షా ల అరాచకాలకు హద్దు లేకుండా పోతోందని దుయ్యబట్టారు. ఇపుడు వారి అరాచక దృష్టి తెలంగాణ పై పడిందని బాజిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవితకు సంబంధం లేని కేసులో ఇరికించాలని చూస్తున్నారని, ఇలాంటి చిల్లర రాజకీయాలకు కేసీఆర్ భయపడరన్నారు.

బీజేపీ రౌడీయిజం ,మోడీ ఈడీఇజం తెలంగాణ లో నడవవని పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి హెచ్చరించారు. కవిత మీద ఆరోపణలు చేసిన వారి మీద లుక్ అవుట్ నోటీసులు ఉన్నాయన్నారు. సీబీఐ, ఈడి,ఐటి శాఖలు బీజేపీ జేబు సంస్థలు కీలు బొమ్మలుగా మారాయని ఆరోపించారు. ప్రత్యర్థులను వేధించడానికి బీజేపీ వ్యవస్థ లను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. మాకు 60 లక్షల సైన్యం ఉంది.. మేము తలచుకుంటే బీజేపీ కార్యకర్తలు రోడ్ల పై తిరగరని జీవన్ రెడ్డి హెచ్చరించారు. సీబీఐ ed లు బీజేపీ చేరికల కమిటీలు గా మారాయన్నారు. బీజేపీ కండువా కప్పుకుంటే కేసులు మాఫీ అవుతాయా అన్న జీవన్ రెడ్డి ఎందరో నియంతలు కాల గర్భంలో కలిసి పోయారు.. మోడీ కి కూడా అది తప్పదని హెచ్చరించారు.

కేంద్రాన్ని స్పష్టంగా ,సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో కేసీఆర్ ఒక్కరేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ ప్రశ్నలకు మోడీ అమిత్ షా లకు వణుకు పుడుతోందని, కేసీఆర్ ను ఎదుర్కోలేక బీజేపీ కవిత పై నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. సిందియా ,హేమంత్ బిశ్వా శర్మ లు బీజేపీ లో చేరగానే ఈడి విచారణ ఆగిపోయిందని సుమన్ గుర్తు చేశారు. అస్థిర పరిచే రాజకీయాలకు అస్తిత్వ రాజకీయాలకు తెలంగాణలో యుద్ధం మొదలైందన్నారు.  కేసీఆర్ కుటుంబం మీద బీజేపీ బురద జల్లడాన్ని తెలంగాణ సమాజం గమనించాలని కోరిన సుమన్ కవిత ఇంటి మీద బీజేపీ గుండాల దాడిని ఖండిస్తున్నామన్నారు. బీజేపీ నిన్నటి ఘటనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు.

Also Read : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి అమిత్ షా

RELATED ARTICLES

Most Popular

న్యూస్