Saturday, January 18, 2025
Homeతెలంగాణరైతుల కోసం బిజెపి పోరు దీక్ష

రైతుల కోసం బిజెపి పోరు దీక్ష

రైతు సమస్యలపై బిజెపి రాష్ట్ర శాఖ ఇవాళ దీక్ష చేపడుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ పిలుపు మేరకు ‘తెలంగాణా రైతు గోస – బిజెపి పోరు దీక్ష’ పేరుతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిరసన తెలపనుంది. కోవిడ్ నేపధ్యంలో ఇంట్లోనే దీక్ష చేయాలని నాయకులు, కార్యకర్తలకు బండి సూచించారు.

రైతులు తాము పండించే పంటను అమ్ముకొనే పరిస్థితిలో లేరని,   రైతుల నుంచి పంట కొనుగోలులో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు, రైతులకు రుణ మాఫీ చేసి వచ్చే సీజన్ కు కావాల్సిన విత్తనాలను వెంటనే పంపిణి చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని, ప్రభుత్వం వెంటనే రైతు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్