సూపర్ స్టార్ మహేష్ బాబు.. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట… ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నారు. అయితే.. ఆయన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి తెలుగులోనే సినిమాలు చేస్తున్నారు కానీ.. హిందీ నుంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ నో చెబుతూనే ఉన్నారు. ఇటీవల మహేష్ బాబు ఓ వేదిక పై బాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
ఇంతకీ మహేష్ ఏమన్నారంటే.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ… బాలీవుడ్ నన్ను భరించలేదు అని బదులిచ్చారు. అది సంచలనం అయ్యింది. దీని పై బాలీవుడ్ ఫిలింమేకర్ రవి రాయ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. కరోనా సంక్షోభం తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు గడ్డుకాలం నడుస్తోందని… దీన్ని ఎవరూ కాదనలేరని అన్నారు. అయితే మహేష్ బాబు బాలీవుడ్ నన్ను భరించలేదు అనే వ్యాఖ్యలను చేశారు. అలాంటి వ్యాఖ్యలు నిజమే అనిపించే స్థాయిలో బాలీవుడ్ దెబ్బతినలేదన్నది వాస్తవం.
ఆ వ్యాఖ్యల పట్ల తప్పుగా ప్రచారం జరిగిందో తెలియదు కానీ… మహేష్ బాబుకు నేను సవినయంగా చేసుకునే విన్నపం ఏంటంటే… ఆయన దయచేసి బాలీవుడ్ కు వచ్చి తనను డైరెక్ట్ చేసే భాగ్యాన్ని కల్పించాలి. బాలీవుడ్ అతడిని ఎందుకు భరించలేదు? మహేష్ ఓసారి చరిత్రను పునరావలోకనం చేసుకోవాలి. జెమినీ గణేశన్, శివాజీ గణేశన్ వంటి నటులకు బాలీవుడ్ స్వాగతం పలికింది అంటూ రవి రాయ్ తన అభిప్రాయాలను వెల్లడించారు. మరి.. ఈ వ్యాఖ్యల పై మహేష్ స్పందిస్తారేమో చూడాలి.
Also Read: ‘బాలీవుడ్’ వ్యాఖ్యల పై క్లారిటీ ఇచ్చిన మహేష్