Saturday, January 18, 2025
Homeసినిమాఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్!

ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్!

ఈ మధ్య కాలంలో ఎక్కువమంది మాట్లాడుకున్న బాలీవుడ్ మూవీ ‘కిల్’. లక్ష్ లాల్వాని – తాన్య మనక్తిలా జంటగా నటించిన ఈ సినిమాకి నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించాడు. ధర్మా ప్రొడక్షన్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, జులై 5వ తేదీన విడుదలైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఒక రేంజ్ లో ఆడియన్స్ లోకి దూసుకువెళ్లింది. భారీ వసూళ్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుందా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు.

అలాంటి ప్రేక్షకుల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు దక్కించుకున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే హిందీలో మాత్రమే అందుబాటులో ఉంటుందా? మిగతా భాషలలోను వదులుతారా? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కథ విషయానికి వస్తే .. అమిత్ రాథోడ్ ఆర్మీలో ఎన్ ఎస్ జీ కమాండర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతను .. తులికా గాఢంగా ప్రేమించుకుంటారు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. కానీ అది ఆమె తండ్రికి ఇష్టం ఉండదు. అతను వేరొకరితో ఆమె నిశ్చితార్థం జరపడానికి ఏర్పాట్లు చేస్తాడు. తండ్రి మాట కాదనలేక తులికా మౌనంగా ఉండిపోతుంది. ఈ విషయం తెలియడంతో అమిత్ వచ్చి ఆమెను తీసుకుని వెళ్లిపోతాడు. వాళ్లు ప్రయాణిస్తున్న ట్రైన్ లోకి 40 మంది బందిపోట్లు చొరబడతారు. అప్పుడు ఏం జరుగుతుందనేదే కథ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్