Saturday, January 18, 2025
Homeసినిమా“బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌” ట్రైలర్ రిలీజ్

“బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌” ట్రైలర్ రిలీజ్

విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై నందు విజ‌య్‌కృష్ణ హీరోగా..ర‌ష్మి గౌతమ్ హీరోయిన్ గా రాజ్ విరాట్ ను దర్శకుడు గా పరిచయం చేస్తూ ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌‘. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు, టీజర్ కు అటు ఆడియెన్స్ లో ఇక‌ ఈ చిత్రం ఆడియో ఆల్బ‌మ్ నుంచి వ‌చ్చిన పాటలు మంచి విజ‌యాన్ని సాధించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకుడు మారుతి,సిద్దు జొన్నలగడ్డ చేతులమీదుగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను చాలా బాగుంది. సినిమా చూస్తున్నంత ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా ఎంటర్ టైన్ అవుతారు. దాంతో విరాట్ కు పిలిచి నెక్స్ట్ మా బ్యానర్లో సినిమా చేయమని చెప్పాను. ఎప్పటి నుంచో కష్టపడుతున్ననందుకు తనకు ఈ సినిమా మంచి టేకాఫ్ ఇస్తుంది. రష్మి కూడా ఈ సినిమాతో మంచి హీరోయిన్ అవుతుంది. మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసిన నిర్మాతలకు ఈ సినిమా ద్వారా మంచి మైలేజ్ వస్తుంది అన్నారు.

సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. డీజే టిల్లు పార్ట్ 2 రాసే క్రమంలో బిజీగా ఉన్నా నందు, రష్మీ ల కోసం వచ్చాను. నేను, నందు, విశ్వక్, రష్మీ అందరం టెన్ ఇయర్స్ బ్యాక్ కలిసి కేరీర్ స్టార్ట్ చేశాం. అప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాం. అలాగే రష్మి నా ఫస్ట్ కో స్టార్ కూడా.. డైరెక్టర్ విరాట్ ఇంతకు ముందు తీసిన షార్ట్ ఫిలిమ్ కి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు తీసుకున్నాడు. అలాగే ఈ సినిమా కంటెంట్ లో ఏదో చాలా క్రేజీనెస్ ఉంది. అలాగే సిద్ధూ ఇచ్చిన విజువల్స్ చాలా బాగున్నాయి మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్