Friday, March 20, 2026
Homeసినిమా‘ఇట్లు అమ్మ’కు లభిస్తున్న ఆదరణ అనూహ్యం అపూర్వం

‘ఇట్లు అమ్మ’కు లభిస్తున్న ఆదరణ అనూహ్యం అపూర్వం

Tremendous Response: ‘అంకురం’ ఫేమ్ సి.ఉమామహేశ్వరావు దర్శకత్వంలో సుప్రసిద్ధ నటి రేవతి టైటిల్ పాత్రలో ఫారిన్ రిటర్నెడ్ బిజినెస్ మేన్ డా. బొమ్మకు మురళి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఇట్లు అమ్మ’ ఓటిటి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. రివార్డులతో పాటు అవార్డులు కూడా వెల్లువెత్తుతున్నాయి. సోని లివ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ‘బొమ్మకు క్రియేషన్స్’ పేరు మారుమ్రోగుతోంది. ఈ ఉత్సాహంతో వరుసగా పలు చిత్రాల నిర్మాణం జరుపుతోంది బొమ్మకు క్రియేషన్స్.

బొమ్మకు క్రియేషన్స్ అధినేత డా. బొమ్మకు మురళి మాట్లాడుతూ “రేవతి గారి నటన, ఉమామహేశ్వరావు దర్శకత్వ ప్రతిభ, మధు అంబట్ ఛాయాగ్రహణం, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, సన్నీ ఎమ్.ఆర్ సంగీతం, గోరేటి వెంకన్న గానం – సాహిత్యం, సుచిత్ర చంద్రబోస్ కొరియోగ్రఫీ తదితర అంశాలు ఈ చిత్రం ఓ దృశ్యకావ్యంగా తీర్చిదిద్దాయి. సోని లివ్ లో ప్రసారమవుతున్న మా చిత్రాన్ని ఓటిటి ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు”

“ఇప్పటికి 60 అవార్డులు వరించాయి. ఈ చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇంత గొప్ప చిత్రం మా బ్యానర్ లో నిర్మాణం కావడం మాకెంతో గర్వకారణం. రేవతి గారు ఈ సినిమా తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పడం మాకు ఎంతో సంతోషం. ఈ ఉత్సాహంతో పలు చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాము” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular