Sunday, September 29, 2024
Homeసినిమాఅఖిల్ డైరెక్ట‌ర్ తో నాగ‌చైత‌న్య మూవీ?

అఖిల్ డైరెక్ట‌ర్ తో నాగ‌చైత‌న్య మూవీ?

New Combination : మ‌జిలీ, వెంకీమామ‌, ల‌వ్ స్టోరీ, బంగార్రాజు.. ఇలా వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ దూసుకెళుతున్న అక్కినేని అంద‌గాడు నాగ‌చైత‌న్య‌. తాజాగా న‌టించిన చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రానికి మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని జులై 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. థ్యాంక్యూ మూవీ త‌ర్వాత ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడో ప్ర‌క‌టించ‌లేదు కానీ.. ప‌ర‌శురామ్, నందినీ రెడ్డి, వెంక‌ట్ ప్ర‌భు, కిషోర్ తిరుమ‌ల‌.. ఇలా చాలా మంది ద‌ర్శ‌కులు నాగ‌చైత‌న్య‌తో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నారు. తాజా వార్త ఏంటంటే.. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ మూవీని తెర‌కెక్కించి విజ‌యాన్ని అందించిన సెన్సిబుల్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తో నాగ‌చైత‌న్య ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ మూవీ త‌ర్వాత బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ నాగ‌చైత‌న్య‌తో సినిమా చేసేందుకు ఓ క‌థ రెడీ చేశాడ‌ట‌. ఇటీవ‌ల బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ నాగ‌చైత‌న్య‌కు క‌థ చెప్ప‌డం జ‌రిగింద‌ట‌. ఈ క‌థ‌కు నాగ‌చైత‌న్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి అనౌన్స్ మెంట్ రానుంద‌ని టాక్. మ‌రి.. ఈ సినిమా నిజ‌మేనా..?   నిజ‌మే అయితే.. ఇది ఏ త‌ర‌హా చిత్రం..?  అనేది క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్