We do justice: అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. భూములిచ్చిన రైతులకు సీఆర్డీఏ చట్టం ప్రకారం న్యాయం చేస్తామన్నారు. అమరావతిని శాసన రాజధానిగా తమ ప్రభుత్వం ప్రకటించిందని, దీనిలో మార్పు లేదని స్పష్టం చేశారు. శివరామ కృష్ణన్ కమిటీ సిఫార్సులు పరిగణనలోకి తీసుకోకుండా, విభజన చట్టాన్ని అమలు చేయకుండా అమరావతిని రాజధానిగా చేశారని మరోసారి ఆరోపించారు. ఒక సామాజిక వర్గం కోసమో, కొన్ని గ్రామాల కోసమో రాష్ట్ర సంపదని ఒకే చోటకు దోచి పెట్టాలని ప్రయత్నించారని మండిపడ్డారు. విజయనగరంలో బొత్స మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై తాను చేసిన వ్యాఖ్యలపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యంగాస్త్రాలు విసరడంపై బొత్స స్పందించారు. తాను ఏ సందర్భంలో అలా చెప్పానో గ్రహించాలని హితవు పలికారు. 2024 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాము హైదరాబాద్ వెళ్ళడం లేదని…. అమరావతి రాజధాని అని చెప్పి అందరినీ ఇక్కడకు రమ్మని చంద్రబాబు పిలిచారని, కానీ బాబు, ఆయన కుటుంబం మాత్రం హైదరాబాద్ లోనే ఉంటున్నారని, దానికేం సమాధానం చెబుతారని నిలదీశారు. అచ్చెన్నాయుడు అవగాహన లేకుండా మాట్షిలాడుతున్నారని బొత్స విమర్శించారు. లావు, ఎత్తు పెరిగినంత మాత్రాన సరిపోదని, బుర్ర కూడా పెరగాలని మంత్రి బొత్స పరోక్షంగా అచ్చెన్నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి: అక్కడికే వెళ్ళండి: బొత్సకు అచ్చెన్న కౌంటర్