విద్యారంగ సమస్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీటుగా స్పందించారు. తాను ఇకపై పవన్ కళ్యాణ్ వద్ద ట్యూషన్ తీసుకుంటానని, కాకపొతే ఆయన హోం వర్క్ సరిగా చేయాలని షరతు పెట్టారు.
“డియర్ పవన్ కళ్యాణ్ … ఈ రోజు నుండి పవన్ కళ్యాణ్ వద్ద ట్యూషన్ తీసుకుంటాను..
కానీ ఏకైక షరతు ఏమిటంటే మీరు హోమ్‌వర్క్ చేస్తానని షరతు మీదనే… అందుకోసం మీకు నేను ముందుగా ఒక అసైన్‌మెంట్ ఇస్తున్నాను అని, మీరు ఈ ఏడు పాఠాలను క్షుణ్ణంగా చదవడమే” అంటూ కౌంటర్ ఇచ్చారు
1: పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ టెండర్‌లకు సంబంధించినంత వరకూ అర్హత లేదా పరిధిని నిర్ణయించే అధికారాన్ని వదులుకున్న ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఆంధ్ర ప్రదేశ్ ఒక్కటే అని దయచేసి తెలుసుకోండి.
2: రూ. 100 కోట్లకు పైబడిన ఏ ప్రభుత్వ టెండర్ నైనా ఖరారు చేసే అధికారం హైకోర్టు సమ్మతితో నియమించబడిన ప్రత్యేక న్యాయమూర్తి ( జస్టిస్ శివశంకర్ రావు) కి దాఖలు పరచడం జరిగింది.
3: టెండర్ స్పెసిఫికేషన్‌లు పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతాం. అదే సమయంలో వాటిపై ప్రతిస్పందించడానికి 21 రోజుల సమయం ఇవ్వబడుతుంది. ఆపై ఇందుకోసం నియమించబడ్డ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత టెండర్ స్పెసిఫికేషన్ అనేది లాక్ చేయబడుతుంది.
4: టెండర్ల స్పెసిఫికేషన్‌లో ప్రపంచంలో న్యాయపరమైన సమీక్ష కల్గిన ఏకైక ప్రభుత్వం మాది అని గొప్పగా చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాము,. ఈ తరహా విధానం కంపెనీలకు సమ న్యాయం జరగడమే కాకుండా అవి సక్సెస్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది.
5: ఈ నిర్దిష్ట టెండర్ లో పాల్గొన్న వివరాలు గూగుల్ సెర్చ్ ద్వారా ఎవారైనా తెలుసుకోవచ్చు. (ఆగస్టు 2022 నుండి పబ్లిక్ డొమైన్‌లో ఉంది) ఈ లింక్‌ను మళ్లీ మీరు మిస్ కాకుండా ఉండేందుకై ఇస్తున్నారం
https://judicialpreview.ap.gov.in/findings-recommendations
6: ఏపీ విద్యా శాఖ అన్ని విషయాల్లో అత్యంత పారదర్శకంగా నడుస్తోంది.
7: ప్రతీసారి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని చూసి మీకు పాఠాలు చెప్పిన టీచర్లు సిగ్గుపడటం ఖాయం. అది చూసి నాకు కూడా జాలేస్తోంది . మీ మెదడులో పదును పెంచేందుకు నేను ప్రత్యామ్నాయ ట్యూషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను” అంటూ బొత్స భారీ ట్వీట్ చేశారు.