Sunday, January 19, 2025
Homeసినిమామ‌హేష్ కోసం.. ఇద్ద‌రు స్టార్..

మ‌హేష్ కోసం.. ఇద్ద‌రు స్టార్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.. కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రానుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ క్రేజీ మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఆగ‌ష్టు రెండో వారంలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు. అయితే.. ప్ర‌స్తుతం షూటింగ్స్ ను ఆపేయాల‌ని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ప్ర‌క‌టించ‌డంతో ఎప్పుడు షూటింగ్స్ స్టార్ట్ అవుతాయో ఇంకా క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే… మ‌హేష్ బాబు కోసం ఒక‌రు కాదు ఏకంగా ఇద్ద‌రు స్టార్ ల‌ను రంగంలోకి దింపుతున్నార‌ట త్రివిక్ర‌మ్. ఒక‌రు క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర కాగా, మ‌రొక‌రు త‌మిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి అని స‌మాచారం. త్రివిక్ర‌మ్.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలో ఉపేంద్ర‌తో కీల‌క పాత్ర చేయించారు. ఈ మూవీలో కూడా ఓ కీల‌క పాత్ర కోసం ఉపేంద్ర‌ను ఎంపిక చేశార‌ని టాక్ వినిపిస్తోంది.

ఇక విజ‌య్ సేతుప‌తిని నెగిటివ్ రోల్ కోసం తీసుకున్నార‌ని తెలిసింది. త్వ‌రలోనే ఉపేంద్ర‌, విజ‌య్ సేతుప‌తి ఈ సినిమాలో ఏ క్యారెక్ట‌ర్స్ పోషించ‌నున్నారో అనౌన్స్ చేస్తార‌ని టాక్. సినిమా షూటింగ్స్ స్టార్ట్ అయిన వెంట‌నే ఈ మూవీని స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. ఎంత ఫాస్ట్ గా అయితే.. అంత తొంద‌ర‌గా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. ఈ క్రేజీ మూవీని స‌మ్మ‌ర్ కి రిలీజ్ చేయాల‌నేది ప్లాన్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్