Sunday, January 19, 2025
HomeTrending NewsBotsa: ఈ కేకలు ఇంకా ఆరు నెలలే: బొత్స ఎద్దేవా

Botsa: ఈ కేకలు ఇంకా ఆరు నెలలే: బొత్స ఎద్దేవా

చంద్రబాబు, పవన్ ల కేకలు, అల్లర్లు వచ్చే ఉగాది వరకూ మాత్రమేనని ఆ తర్వాత అంతా సైలెన్స్ అవుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.   ఈ ఆరు నెలలూ వారు ఇదే విధంగా కేకలు వేస్తుంటారని విమర్శించారు. విశాఖలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురూ మూడుపక్కలా తిరుగుతూ తమ ప్రభుత్వాన్ని, సిఎం జగన్ ను ఆడిపోసుకుంటున్నారని బొత్స అన్నారు.  నోటికి ఎంత మాటపడితే అంత మాట్లాడుతున్నారని, దీనికి ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని అన్నారు.  ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, వారి ఆస్తులు పెంచడానికి సిఎం జగన్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందిస్తుంటే మీ తాత సొమ్మా అంటూ బాబు మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు.  పేదవారు తలెత్తుకునేలా చేసింది తమ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

తెలుగుదేశం పరిపాలన బాగుందని పవన్ కళ్యాణ్ చెప్పడం.. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడినట్లు ఉందని బొత్స ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయం శుద్ధ దండుగ అని చెప్పడం. జన్మభూమి కమిటీ అక్రమాలు, పెత్తందారి వ్యవస్థ… ఇవన్నీ ప్రభుత్వ విధానాలా అని  నిలదీశారు. మీరు బాగుందని చెప్పడానికి కొలమానం ఏమిటో చెప్పాలన్నారు.  పవన్ రిషికొండ దగ్గర హంగామా చేశారని, కానీ తాము ఏడాది క్రితమే అది ప్రభుత్వ భవనం అని చెప్పామని, అంతకు ముండు ఉన్న రిసార్ట్స్ తొలగించి భవనాలు కడుతున్నామని తామే చెప్పమని, దీనితో మీకు వచ్చిన ఇబ్బందేమిటని అడిగారు. వైసీపీ ప్రభుత్వాన్ని రానివ్వబోమని  చెబుతున్న పవన్ ఆయన వద్ద ఉన్న ప్రజల కోసం ఉన్న ప్రణాళిక ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.  మాట్లాడేటప్పుడు సహనం పాటించాలని సూచించారు.

విశాఖలో 30 వేల కోట్ల రూపాయల భూములు దోచుకున్నారంటూ పవన్ చేసిన ఆరోపణలపై బొత్స  ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రోత్ సెంటర్ భూములపై ఈనాడు  పత్రికలో వచ్చిన వార్తపై బొత్స తీవ్రంగా స్పందించారు. రామోజీలా దోచుకు తినడం, పేదవారి రక్తం పీల్చడం తనకు అలవాటు లేదని దుయ్యబట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్