Saturday, November 23, 2024
HomeTrending Newsకేటియార్ వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం

కేటియార్ వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం

Not Fair: ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులపై తెలంగాణా మంత్రి కేటిఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు.  పొరుగు రాష్ట్రంపై అలా మాట్లాడడం సరికాదని సూచించారు. కేటిఆర్ కు అతని ఫ్రెండ్ చెప్పి ఉండొచ్చని కానీ తాను హైదరాబాద్ అప్పుడప్పుడూ వెళ్లి వస్తున్నానని, అక్కడ కూడా కరెంట్ పరిస్థితి అంత సరిగా లేదని, కోతలు ఉన్నాయని, తాను స్వయంగా అక్కడి పరిస్థితిని అనుభవిస్తున్నానని, కరెంట్ లేక జనరేటర్ వేసుకోవాల్సి వచ్చిందని  బొత్స వెల్లడించారు. కేటియార్ తన రాష్ట్రం గురించిన విషయాలు చెప్పుకోవచ్చు గానీ, పొరుగు రాష్ట్రం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు బొత్స. అయన వస్తే ఇక్కడ అభివృద్ధి ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ లో జరిగిన క్రెడాయ్ మీటింగ్ లో కేటిఆర్ మాట్లాడుతూ త‌న స్నేహితుడు ఒక‌రు ఇటీవల ప‌క్క రాష్ట్రానికి సంక్రాంతికి ఊరికి వెళ్ళాడ‌ని..అక్కడ నుంచి వ‌చ్చాక వివ‌రాలు చెప్పాడ‌ని, ‘క‌రెంట్ లేదు. నీళ్ళు లేవు..రోడ్లు ధ్వంసం అయ్యాయి.అక్కడ అన్యాయం..అధ్వాన్నంగా ఉంది’ అని చెప్పాడని వివరించారు. తిరిగి వ‌చ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందంటూ తన స్నేహితుడు చెప్పాడన్నారు. ఇక్కడ నుంచి బ‌స్సులు పెట్టి అక్కడ‌కు పంపాలని, అప్పుడే వారికి తెలంగాణ విలువ ఏమిటో తెలుస్తుందని తన ఫ్రెండ్ చెప్పడంతో కేటిఆర్ వ్యాఖ్యానించారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్