Wednesday, March 18, 2026
Homeసినిమాబన్నీతో కథను ఖరారు చేసుకున్న బోయపాటి! 

బన్నీతో కథను ఖరారు చేసుకున్న బోయపాటి! 

బోయపాటి చాలా కాలం క్రితం బన్నీతో ‘సరైనోడు’ సినిమాను చేశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతవరకూ బన్నీ చేసిన సినిమాలను మించి అత్యధిక వసూళ్లను సాధించింది. ఆ సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్ … యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. బన్నీ అభిమానుల నుంచి మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమా ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో టెలీకాస్ట్ అయితే మంచి రేటింగ్ వస్తుండటం విశేషం.

ఆ సినిమా తరువాత బన్నీ – బోయపాటి కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూ వస్తున్నారు. నిజానికి ‘పుష్ప’ సినిమా కంటే ముందు బోయపాటి సినిమానే బన్నీ చేయవలసి ఉంది. ‘పుష్ప’ తరువాత చేద్దామని అనుకున్నారు. కానీ సీక్వెల్ ను వెంటనే ప్లాన్ చేయడం వలన మరింత ఆలస్యమైంది. ఈ లోగా బన్నీ కోసం అనుకున్న కథపై బోయపాటి కాస్త గట్టిగానే కసరత్తు చేస్తూ వెళ్లాడని అంటున్నారు. ఎందుకంటే స్క్రిప్ట్ విషయంలో బన్నీ చాలా స్ట్రిక్టు.

మొత్తానికి బోయపాటి స్క్రిప్ట్ రెడీ చేసుకుని వెళ్లి బన్నీకి వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ‘పుష్ప 2’ తరువాత బోయపాటితోనే బన్నీ సినిమా ఉండనుందని సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయని అంటున్నారు. ఇక బన్నీతో సినిమా తరువాతనే బాలయ్యతో ప్రాజెక్టును బోయపాటి లైన్ పైకి తీసుకురానున్నాడని చెబుతున్నారు. ‘స్కంద’ ఫ్లాప్ తో ఉన్న బోయపాటి, దానిని మరిపించే ప్రయత్నం చేస్తాడేమో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular