Thursday, March 12, 2026
HomeసినిమాAkhanda2: మరింత పవర్ఫుల్ విలనిజంతో 'అఖండ 2'

Akhanda2: మరింత పవర్ఫుల్ విలనిజంతో ‘అఖండ 2’

బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ‘అఖండ’ ఒకటిగా కనిపిస్తుంది. 2021 .. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా విడుదలైంది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, సంచలన విజయాన్ని సాధించింది. అఘోర పాత్రను .. పరోక్షంగా దైవశక్తిని టచ్ చేస్తూ నడిచే కథ ఇది. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో మాస్ యాక్షన్ సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఈ కథ దైవాంశ కలుపుకుంటూ ముందుకు వెళ్లింది. దాంతో వసూళ్ల విషయంలో సునామీని సృష్టించగలిగింది.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని బోయపాటి అప్పుడే చెప్పాడు. ఆల్రెడీ ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన కథను ఆయన రెడీ చేసినట్టుగా .. బాలయ్య ఓకే చెప్పినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఈ ఏడాదిలోనే ఆయన ఈ ప్రాజెక్టును సెట్ పైకి తీసుకెళ్లనున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందువలన ఈ సినిమాలోని విలనిజాన్ని మరింత పవర్ఫుల్ గా బోయపాటి డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది.

విలన్ పాత్రకి గాను సంజయ్ దత్ ను అనుకుంటున్నట్టుగా సమాచారం. సంజయ్ దత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. పవర్ఫుల్ విలనిజానికి ఆయన కెరాఫ్ అడ్రెస్ గా మారిపోయి చాలా కాలమవుతోంది. ‘కేజీఎఫ్’ సినిమాతో ఆయన మరింత బిజీ అయ్యారు. తమిళంలో ‘లియో’లో నటించిన ఆయన, ‘డబుల్ ఇస్మార్ట్’లోను నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను ‘అఖండ 2’ కోసం సంప్రదిస్తున్నారట. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular