Tuesday, March 10, 2026
Homeసినిమాబోయపాటి నమ్మకం

బోయపాటి నమ్మకం

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు పార్ట్ ల్లో ఫస్ట్ ఫార్ట్ ఈ సంవత్సరం చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. అయితే… అల్లు అర్జున్ పుష్ప తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఇప్పటి వరకు అఫిషియల్ గా ప్రకటించలేదు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్, మురుగుదాస్, విక్రమ్ కుమార్, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీను అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు కథలు రెడీ చేస్తున్నారు.

దీంతో అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాసు పుష్ప ఫస్ట్ పార్ట్ తర్వాత వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో ‘ఐకాన్’ మూవీ చేయనున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే.. బోయపాటి శ్రీను మాత్రం బన్నీ పుష్ప తర్వాత చేసేది తన చిత్రమే అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో బన్నీ, బోయపాటి కలిసి ‘సరైనోడు’ సినిమా చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మరోసారి కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ బోయపాటికి ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చింది.

అందుచేత బన్నీ – బోయపాటి కాంబినేషన్ లో మూవీ జనవరిలో స్టార్ట్ కానుందని టాక్ వినిపిస్తోంది. మరి.. బోయపాటి నమ్మకం నిజమై.. పుష్ప తర్వాత ఈ సినిమానే స్టార్ట్ అవుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular