Saturday, January 18, 2025
Homeసినిమాఅయితే బన్నీ, లేకపోతే సూర్యతో బోయపాటి

అయితే బన్నీ, లేకపోతే సూర్యతో బోయపాటి

తమిళ స్టార్ హీరో సూర్య ఎప్పటి నుంచో తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నారు కానీ.. కుదరలేదు. అయితే.. తమిళ హీరోలు విజయ్, ధనుష్ తెలుగు సినిమాలు చేసేందుకు రెడీ అవుతుండడంతో ఇక సూర్య ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అనుకున్నారేమో. బోయపాటి శ్రీను చెప్పిన స్టోరీకి ఓకే చెప్పారట. సూర్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. లాక్ డౌన్ టైమ్ లో బోయపాటి కొన్ని కథలు రెడీ చేశారు. అందులో ఒకటి బన్నీ కోసం కాగా, మరొకటి సూర్య కోసం.

అయితే.. బోయపాటి ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను బన్నీతోనే సినిమా చేయాలి అనుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. బన్నీతో సినిమా చేసేందుకు వరుసగా కొన్ని ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. అందుచేత.. బన్నీతో ప్రాజెక్ట్ వెంటనే కుదరకపోతే.. సూర్యతో సినిమాని స్టార్ట్ చేయాలనేది బోయపాటి ప్లాన్. అయితే.. బోయపాటి ‘అఖండ’ తర్వాత బన్నీతో సినిమా చేస్తారా.? లేక సూర్యతో సినిమా చేస్తారా.? అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్