ఊర మాస్ డైరెక్టర్ అంటే. ఠక్కున గుర్తొచ్చేది బోయపాటి శ్రీను. భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బోయపాటి ఆతర్వాత తులసి, సింహా, దమ్ము, లెజెండ్, సరైనోడు, జయ జానకి నాయక, వినయ విధేయ రామ, అఖండ.. ఇప్పుడు స్కంద చిత్రాలను తెరకెక్కించారు. అయితే.. ఆయన సినిమాలు అన్నీ ఒకేలా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కారణం ఏంటంటే.. ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాల్లో హీరో డబుల్ రోల్ చేయడం.. ఒక క్యారెక్టర్ ఆపదలో ఉన్నప్పుడు రెండో క్యారెక్టర్ ఎంటర్ అవ్వడం జరుగుతుంది.
లెజెండ్, అఖండ, స్కంద చిత్రాల్లో ఇలాగే జరిగింది. మరో వైపు హింస కూడా చాలా ఎక్కువుగా చూపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అలాగే బోయపాటి సినిమా అంటే.. కామన్ గా కనిపించే మరో విషయం పెద్ద ఫ్యామిలీని చూపించడం. ఇలా బోయపాటి సినిమాలు రొటీన్ గానే ఉంటున్నాయి తప్పా.. కొత్తదనం కనిపించడం లేదనే కంప్లైట్ బాగా వినిపిస్తుంది. ఇదే విషయం గురించి బోయపాటిని ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో అడిగితే.. తన ప్రతి సినిమాలో కొత్తదనం ఉంటుందన్నట్టుగా మాట్లాడారు. అంతే కాకుండా.. స్కంద సినిమా హిట్ సినిమా అన్నట్టుగా.. చాలా మంచి సినిమా తీసానన్నట్టుగా చెప్పారు.
తన సినిమా రిలీజైన తర్వాత ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్లు కొంత మంది ఉన్నారని.. వాళ్లు ఫోన్ చేసి స్కంద సినిమాని బాగా తీశావు భయ్యా అన్నారని బోయపాటి చెప్పారు. స్కంద హిట్ సినిమా అన్నట్టుగా చెప్పారు కానీ.. ఫ్లాపు అని మాత్రం ఒప్పుకోవడం లేదు. పైగా తను అలా ఎందుకు తీసానో చెబుతూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. తన నుంచి ఇదే స్టైల్ లో ఇంతకు మించిన చిత్రాలు వస్తాయన్నట్టుగా చెప్పారు. దీనిని బట్టి బోయపాటి.. ఎవరి మాట వినడంతే.. ఆయన మారడంతే.. అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.