Saturday, November 23, 2024
HomeTrending Newsఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు

ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు

Br Ambedkar 131 Jayanti Celebrations :

రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 131 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రాజకీయ పార్టీల నేతలు, స్వచ్చంద సంస్థలు రాజ్యాంగ నిర్మాత సేవల్ని గుర్తు చేసుకుంటూ కార్యాక్రమాలు నిర్వహించారు.  రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్ అంబెడ్కర్ జయంతి సందర్భంగా హైదరబాద్ లోని శాసనసభ ఆవరణలోని విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించిన శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్ MS ప్రభాకర్ రావు, MLCలు శ్రీమతి కల్వకుంట్ల కవిత, విజీ గౌడ్, బుగ్గారపు దయానంద్, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, లేజిస్లేటివ్ సెక్రటరీ డా వి నరసింహా చార్యులు పాల్గొన్నారు.

Br Ambedkar 132 Jayanti

వ‌రంగ‌ల్ – హ‌న్మ‌కొండ లోని అంబేద్క‌ర్ చౌర‌స్తాలో రాజ్యాంగ ర‌చ‌యిత అంబేద్క‌ర్ విగ్ర‌హానికి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర రావు పూల మాల వేసి, పుష్పాంజ‌లి ఘ‌టించారు. హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, మాజీ ఉప ముఖ్య మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్ జిల్లా కలెక్టర్, హన్మకొండ ఇంచార్జీ కలెక్టర్ గోపి, కుడా వైస్ చైర్ పర్సన్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  జయంతి సందర్భంగా నేడు మహబూబాబాద్ జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ అమర్ హై అంటూ… అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామని  నినదించారు. మంత్రితో పాటు జెడ్పి చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, కొమురయ్య, ఎస్పి శరత్ చంద్ర పవర్, అదనపు ఎస్పీ సదయ్య, స్థానిక నేతలు, జిల్లా అధికారులు ఉన్నారు.

భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ‘దళితబంధు’ విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్‌  జయంతి సందర్భంగా నిర్మల్ లోని ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరు ముశ్రఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టరేట్ హేమంత్ బొర్కడే, నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, నిర్మల్ జిల్లా టీఆర్ఎస్  అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Br Ambedkar 132 Jayanti

భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ  పట్టభద్రుల MLC జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాభవన్లో మరియు తహసిల్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సహం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

సూర్యాపేటలో ఘనంగా అంబెడ్కర్ జయంతి ఉత్సవాలు. అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 131వ  జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

Also Read : అంబేద్కర్  ఆలోచలనకు మరణం లేదు: జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్