Tuesday, March 17, 2026
Homeసినిమాగుంట మల్లేశం 'బ్రహ్మచారి' ఆడియో, టీజర్ విడుదల

గుంట మల్లేశం ‘బ్రహ్మచారి’ ఆడియో, టీజర్ విడుదల

తెలంగాణ ఉద్యమనేత, యం.యల్. సి దేశపతి శ్రీనివాస్ ‘బ్రహ్మచారి’ ఆడియో, టీజర్ ను విడుదల చేశారు. దుబాయ్ కి వెళ్లి వచ్చిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందామనుకున్న టైంలో  అమ్మాయి దొరకక  ఎలాంటి  ఇబ్బందులు ఎదుర్కున్నాడు ? చివరి కేం జరిగింది అనేదే ఈ కథ. “అద్వితీయ ఎంటర్టెయినర్స్  పతాకంపై గుంట మల్లేశం, సిరి, స్వప్న నటీ, నటులుగా నర్సింగ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బి రాంభూపాల్ రెడ్డి నిర్మిస్తున్న పక్కా తెలంగాణ కామెడీ చిత్రం బ్రహ్మచారి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సందర్బంగా తెలంగాణ ఉద్యమనేత, కవి, గాయకుడు, దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

యం. యల్. సి దేశపతి శ్రీనివాస్ మాట్లాడారు.తెలంగాణా జీవితాల్లో  వెలికి తీసి ప్రదర్శించే అటువంటి కథలు మన తెలంగాణ లో ఉన్నాయని, అవి కల్చరల్ , హిస్టారికల్, మానవ జీవితానికి  సంబందించిన అంశాలు  ఇలా ఏవైనా కావచ్చు చాలా కథలు ఉన్నాయని, అవి ఇప్పుడు ప్రారంభమయ్యాయి అని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ కు సంబందించిన టెక్నిసియన్స్, యాక్టర్స్ రావడం శుభపరిణామం అని చెప్పవచ్చని, దర్శకుడు  నర్సింగ్ మంచి రైటర్  తను రాసుకున్న కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉందని తెలిపారు. తను ఇలాంటి మంచి కథలతో సినిమాలు తీసి దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

చిత్ర దర్శకుడు నరసింగ్  మాట్లాడుతూ…ప్రతి సమస్య కు మా గురువు గారు  దొరవేటి పరిష్కొరం చూపారని, రిలీజ్ చేస్తానా లేదా అనుకున్న టైంలో మా ప్రొడ్యూసర్ రాంభూపాల్ ముందుకు వచ్చి సపోర్ట్ గా నిలిచారని, సినిమా షూటింగ్ పూర్తి చేశామని, త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. సినిమా తీయడం తమ వంతు అయితే , మీడియా, ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే ఇపుడు తాము తీసిన ఈ సినిమా మరో బలగం సినిమా అవుతుందన్నారు. ఇందులో నటించిన వారు అందరూ చాలా బాగా నటించారని, అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా  బాగా వచ్చిందని, త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ “బ్రహ్మచారి”  చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

చిత్ర హీరో గుంట మల్లేశం మాట్లాడుతూ… ఇది తన మొదటి చిత్రం అని,  తెలంగాణకు సంబందించిన ఇలాంటి మంచి కథ ఉన్న చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular