Sunday, May 4, 2025
Homeసినిమాసిఎం కెసిఆర్ ను కలుసుకున్న బ్రహ్మానందం

సిఎం కెసిఆర్ ను కలుసుకున్న బ్రహ్మానందం

సుప్రసిద్ధ సినీ నటుడు బ్రహ్మానందం తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్  లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలుసుకున్నారు. త్వరలో  హైదరాబాదులో జరుగనున్న తన రెండవ కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందించారు.  కెసిఆర్ దంపతులు వీరిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తాను స్వయంగా పెయింటింగ్ వేసిన శ్రీ వెంకటేశ్వర స్వామీ చిత్రపటాన్ని కెసిఆర్ కు బ్రహ్మానందం అందించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్