Sunday, January 19, 2025
Homeసినిమా'మాధవే మధుసూదన' నుండి పాట రిలీజ్ చేసిన బ్రహ్మానందం

‘మాధవే మధుసూదన’ నుండి పాట రిలీజ్ చేసిన బ్రహ్మానందం

బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకం పై తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మాధవే మధుసూదన’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ నుంచి రెండవ లిరికల్ సాంగ్ డా. పద్మశ్రీ బ్రహ్మనందం ఆవిష్కరించారు.

అనంతరం డా. బ్రహ్మనందం మాట్లాడుతూ… మాధవే మధుసూదన సినిమా నుంచి సైయారా.. సైయారా.. సాంగ్ చూడడం జరిగింది. నేను బాగోకపోతే ఎవ్వరిని పొగడను. బొమ్మదేవర రామచంద్ర రావు కుమారుడైన తేజ్ బాగా యాక్ట్ చేసాడు. కంగ్రాట్యులేషన్ తేజ్ నీకు మంచి భవిష్యత్ ఉంటుంది. కొత్తకుర్రాడు అయినా చాలా ఈజ్ వుంది. డ్యాన్స్ బాగా చేసాడు. డైరెక్టర్ బొమ్మదేవర రామచంద్ర రావు (చంద్ర) నాకు చాలా కాలంగా తెలుసు కానీ ఇంత బాగా డైరెక్షన్ చేస్తాడని నేను అనుకోలేదు. మంచి అభిరుచి వున్నా చంద్ర, నిర్మాతగా కూడా మంచి విజయం సాధించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. పాట చాలా చాలా బాగుంది. కొరియోగ్రఫీ కూడా బావుంది. కొరియోగ్రాఫర్ రాజు సుందరం మాస్టర్ కి కంగ్రాట్యులేషన్. ఇక ఈ టీమ్ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్