Saturday, September 21, 2024
HomeTrending Newsఆండ్రూ ఫ్లెమింగ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్

ఆండ్రూ ఫ్లెమింగ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వివిధ దేశాల కాన్సులేట్ జనరల్ ల మన్నలను పొందుతూ ముందుకు కొనసాగుతోంది. US మాజీ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా మరియు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ (ఐఏఎస్) ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు బంజారాహిల్స్ లోని  బ్రిటిష్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో మొక్కలు నాటిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు చాలా అద్భుతమైన కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్నారని ప్రశంసించారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అందరూ భాగస్వాములై కోట్ల మొక్కలు నాటాలని ఈ భూగోళం అంతా ఆకుపచ్చగా మారాలని అప్పుడే వాతావరణ కాలుష్యం తగ్గుతుందని ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా మనందరం ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఛాలెంజ్ లో భాగంగా నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఆలీ IAS,  అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, షీ టీం ఇంచార్జ్ స్వాతి లక్రా IPS, సులేమాన్ కక్కర్ ఆప్ఘనిస్తాన్ కాన్సులేట్ జనరల్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఆండ్రూ ఫ్లెమింగ్ కొరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్