Tuesday, March 10, 2026
Homeసినిమా#BRO ఫస్ట్ లుక్ విడుదల చేసిన రష్మిక

#BRO ఫస్ట్ లుక్ విడుదల చేసిన రష్మిక

ఎన్నో హిట్ సినిమాలలో నటించిన హీరో,హీరోయిన్ లు ఈ మధ్య కథకు  ప్రాధాన్యత ఇస్తున్నారు. కథ బలంగా ఉంటే వారి క్యారెక్టర్ గురించి ఆలోచించరు. ఇప్పుడు అదే కోవలో కథకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఇప్పుడు నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నా చెల్లెలుగా నటిస్తుండడం విశేషం. మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సమర్పణలో జెజెఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై నవీన్ చంద్ర, అవికా గోర్, సంజన సారథి, సాయి రోనక్ నటీనటులుగా కార్తీక్ తుపురాణి దర్శకత్వంలో జె.జె.ఆర్. రవిచంద్ నిర్మిస్తున్న చిత్రం #BRO. అన్నాచెల్లెల్లుగా నటిస్తున్న నవీన్ చంద్ర, అవికాగోర్ ల ఫస్ట్ లుక్ ను ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన విడుదల చేసింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత  జె.జె.ఆర్ రవిచంద్ మాట్లాడుతూ… హీరోయిన్ రష్మిక మందన ఎంతో బిజీగా వున్నా మేము అడిగిన వెంటనే మా #BRO చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసినందుకు మా టీం తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. తను లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే  నవీన్ చంద్ర, అవికాగోర్ ల లుక్ చూసి చాలమంది స్టోరీ ఎంటని  ఫోన్స్ చేస్తున్నారు. అన్నాచెల్లెళ్ళ మధ్య జరిగే  ఓ మంచి ఎమోషనల్  ఫాంటసీ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎంతో క్యూరియాసిటీగా డీఫ్రెంట్ గా ఉంటుంది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular