Tuesday, February 25, 2025
Homeసినిమా'బ్రో' టీజర్‌ వచ్చేసింది మామ అల్లుడు అదరగొట్టేసారు..

‘బ్రో’ టీజర్‌ వచ్చేసింది మామ అల్లుడు అదరగొట్టేసారు..

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న భారీ, క్రేజీ చిత్రం ‘బ్రో’. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. నుంచి ఇవాళ టీజర్ రిలీజైంది. పవన్ గెటప్పులు, డైలాగులు సినిమాలో ఎలా ఉంటాయో ఈ టీజర్ లో శాంపిల్ గా చూపించారు.

పవన్-సాయితేజ్ ను టీజ్ చేయడం చిన్న పిల్లాడ్ని బ్రో అంటూ సాయితేజ్ తనదైన కామెడీ టైమింగ్ తో చెప్పిన డైలాగ్… కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం అంటూ పవన్ ఫిలాసఫికల్ డైలాగ్ విసరడం… మొత్తమ్మీద బ్రోపై అంచనాలు పెంచేలా టీజర్ ఉంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మ్యాజికల్ గా ఉంటుందనడంలో సందేహంలేదు.టీజర్ విడుదలైన గంటలోనే 1.2 మిలియన్ల వ్యూస్ సంపాదించిందంటే బ్రో మేనియా ఎలా ఉందో అర్థమవుతోంది.జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ్రో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నిన్ననే పవన్ కల్యాణ్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు. బ్రో చిత్రం జులై 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్