Sunday, January 19, 2025
Homeసినిమా'బ్రో' మూవీ వెనుక అంత జరిగిందా?

‘బ్రో’ మూవీ వెనుక అంత జరిగిందా?

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే – సంభాషణలు అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ స్వరాలూ సమకూర్చాడు. అయితే.. ఇప్పటి వరకు రెండు పాటలు రిలీజ్ చేశారు. ఈ పాటలు బాగానే ఉన్నాయి కానీ.. ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. ఇంకా చెప్పాలంటే.. థమన్ ఇలాంటి పాటలు ఇచ్చాడేంటనే విమర్శలు బాగా వచ్చాయి. బ్రో పాటలు విన్న తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్ అయ్యిందనే వార్తలు వచ్చాయి.

కారణం ఏంటంటే.. మహేష్ ‘గుంటూరు కారం’ చిత్రానికి  కూడా థమన్  సంగీతం అందిస్తున్నాడు. పవన్ బ్రో చిత్రానికే నాసిరకంగా ఉన్నట్టు మ్యూజిక్ ఇస్తే.. ఇక మహేష్ సినిమాకి మ్యూజిక్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారని ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే.. బ్రో చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా బ్రో చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఓ సామాజిక వర్గం బ్రో సినిమా కంటెంట్‌ను బ్యాడ్ చేసే ప్రయత్నం చేసిందని చెప్పి షాక్ ఇచ్చారు.  బ్రో సినిమా పాటలు ఆశించినట్టుగా లేవన్న అభిప్రాయం జనాల్లో బలంగా వుందన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, 70 నుంచి 80 శాతం బాగున్న కంటెంట్ ను కూడా పని గట్టుకుని యుఎస్ లోని ఓ వర్గం ట్రోల్ చేసిందని చెప్పారు.

అంతే కాకుండా ఓ సాఫ్ట్ వేర్ సంస్థ అధినేతగా ఈ ట్రోల్స్ ఎక్కడ నుంచి ఏ ఐపి నుంచి, ఏవిధంగా జరిగాయన్నది తాను తెలుసుకున్నానని చెప్పారు. బ్రో సినిమా మాస్ మసాలా సినిమా కాదని, సకుటుంబంగా చూసే మంచి సినిమా అని చెప్పారు. అయితే.. నిర్మాత ఇలా మాట్లాడినప్పటి నుంచి నిజంగా బ్రో సినిమా వెనుకు ఇంత  జరిగిందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కంటెంట్ బాగుంటే.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సక్సెస్ ని ఆపలేరు. మరి.. బాక్సాఫీస్ దగ్గర బ్రో ఎంత వరకు మెప్పిస్తాడో..? ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో..? చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్