Friday, March 13, 2026
HomeసినిమాPawan-Sai Dharam: 'బ్రో' రన్ టైమ్ ఎంత?

Pawan-Sai Dharam: ‘బ్రో’ రన్ టైమ్ ఎంత?

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్ అయితే.. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండడంతో ఈ సినిమా ఖచ్చితంగా అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

ఈ నెల 28న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే.. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఇక ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. రన్ టైమ్ ఎంతంటే.. 134.30 నిమిషాల నిడివి అని తెలిసింది. అంటే.. రెండు గంటల పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్స్. రన్ టైమ్ కాస్త తక్కువే ఉండడం సినిమాకి ప్లస్ అని చెప్పచ్చు. ఏమాత్రం బోర్ అనేది లేకుండా అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలించవచ్చు. అదే కనుక జరిగితే సినిమా హిట్టే. ఈ నెల 28న బ్రో మూవీ భారీ స్థాయిలో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular