Tuesday, March 17, 2026
Homeసినిమా‘వర్జిన్ స్టోరి’ నుంచి బ్రోకెన్ లవ్ సాంగ్ విడుదల.

‘వర్జిన్ స్టోరి’ నుంచి బ్రోకెన్ లవ్ సాంగ్ విడుదల.

Broken love: ప్ర‌ముఖ నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వర్జిన్ స్టోరి’. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకం పై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. ‘వర్జిన్ స్టోరి’ సినిమా ఈ నెల 18న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని బ్రోకెన్ లవ్ పాటను విడుదల చేశారు.

అచ్చు రాజమణి సంగీతాన్ని అందించిన బ్రోకెన్ లవ్ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా హారికా నారాయణ్ పాడారు. ప్రేమికుడు దూరమైన సందర్భంలో నాయిక పాడుకునే విరహ గీతం ఇది. ‘ఏమో ఏమో అనుకోవడం, ఏదో ఏదో అయిపోవడం, ఏమో ఏమో ఏం చేయడం, ఎన్నో ప్రశ్నలైందే ఒక జీవితం’… అంటూ సాగుతుందీ పాట. మ్యూజిక్ పరంగా ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఇప్పటిదాకా విడుదలైన పాటలు ‘మనసా నిన్నలా’, ‘కొత్తగా రెక్కలొచ్చెనా’, ‘బేబీ ఐయామ్ ఇన్ లవ్’ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. తాజాగా బ్రోకెన్ లవ్ కూడా యూత్ కు బాగా రీచ్ అయ్యేలా ఉంది. టీజర్ , ట్రైలర్ తో పాటు ఈ ఛాట్ బస్టర్ సాంగ్స్ సినిమా పై క్రేజ్ పెంచుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular