Thursday, March 19, 2026
HomeTrending Newsరిమోట్ ఓటింగ్ కు బీ.ఆర్.ఎస్ వ్యతిరేకం - బోయినపల్లి వినోద్

రిమోట్ ఓటింగ్ కు బీ.ఆర్.ఎస్ వ్యతిరేకం – బోయినపల్లి వినోద్

రిమోట్ ఓటింగ్ విధానాన్ని బీ.ఆర్.ఎస్. పార్టీ  తరపున వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ తెగేసి చెప్పారు. ఆ ప‌ద్ధ‌తి దేశంలో అవ‌స‌రం లేదన్నారు. ఢిల్లీలో ఈ.సీ. సమావేశం నేపథ్యంలో విలేకరుల ప్రశ్నలపై వినోద్ కుమార్ స్పందించారు. అభివృద్ధి చెందిన దేశాలే రిమోట్ ఓటింగ్ విధానాన్ని ప‌క్క‌న పెడుతున్నాయని ఆయన అన్నారు. పార్టీలో చర్చించి ఈనెల 30 లోగా కేంద్ర ఎన్నికల కమిషన్ కు లిఖిత పూర్వకంగా బీ.ఆర్.ఎస్. పార్టీ అభిప్రాయం తెలుపుతామని వెల్లడించారు. ఎన్నిక‌ల్లో వాడుతున్న ఈవీఎంల‌ను హ్యాక్ చేస్తున్నార‌నే అనుమానాలు, ప్ర‌చారాలు బ‌లంగా ఉన్నాయన్నారు. వాటినే ఈసీ ఇప్ప‌టి వ‌ర‌కు నివృత్తి చేయ‌లేదు. అలాంటప్పుడు మ‌ల్టీ కానిస్టిట్యూయెన్సీ రిమోట్ ఓటింగ్ యంత్రాలను ఎలా విశ్వ‌సిస్తామన్నారు.

అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండ్ దేశాలే ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల‌ను ప‌క్క‌న‌ పెట్టేశాయని వినోద్ కుమార్ గుర్తు చేశారు. నిత్యం బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేస్తున్న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అలాంట‌ప్పుడు ఎక్క‌డో విదేశాల్లో ఉన్న వ్య‌క్తి పేరుతో వేసే ఓట్ల‌ను ఎలా న‌మ్మ‌గ‌లమన్నారు. అక్క‌డి నుంచి ఆ ఓట‌రే ఓటు వేస్తున్నాడా..? హ్యాక్ చేస్తున్నారా..? ఎలా తెలుసుకోగ‌లమని వినోద్ కుమార్ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular