Sunday, January 19, 2025
HomeTrending NewsBRS:మే నెలాఖరు వరకు బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు

BRS:మే నెలాఖరు వరకు బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు

భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తృతంగా చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనాలు మే నెలాఖరు వరకు నిర్వహించుకోవచ్చని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పార్టీ శ్రేణులకు తెలియజేశారు. గతంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనాల ప్రారంభంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వ తేదీ నాటికి ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేసుకోవాలని సూచించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాల నేపథ్యంలో ముఖ్యమంత్రి, పార్టీ అద్యక్షులు కెసియార్ అదేశాల మేరకు మరింత కులంకషంగా, విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కేటీఆర్ ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను కోరారు. ప్రస్తుతం గడువుని మరింతగా పెంచిన నేపథ్యంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు మరింత విస్తారంగా నిర్వహించుకునే వీలు కలుగుతుందని కేటీఆర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో ఈ మేరకు సమన్వయం చేసుకోవాలని పార్టీ నియమించిన జిల్లా ఇన్చార్జిలకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

Also Read : Parliament: రాహుల్ గాంధీ అనర్హత వేటుపై దద్దరిల్లిన పార్లమెంట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్