Friday, September 20, 2024
HomeTrending Newsతెలంగాణలో కొత్త కూటమి.. కెసిఆర్ తో ప్రవీణ్ కుమార్ భేటి

తెలంగాణలో కొత్త కూటమి.. కెసిఆర్ తో ప్రవీణ్ కుమార్ భేటి

కాంగ్రెస్, బిజెపిలను ఎదుర్కునేందుకు తెలంగాణలో కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. మంగళవారం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో హైదరాబాద్ నంది నగర్ నివాసంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీ ప్రతినిధుల బృందంతో కలిసి జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం జరిగింది.

సమావేశం వివరాలని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇందుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు ఇరు పార్టీలు ప్రకటించాయి. ఇందుకు సంబంచిన విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నాయని నేతలు తెలిపారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో BRS, BSP కలిసి పోటీ చేయాలని నిర్ణయించామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఎన్ని సీట్లు పోటీ చేయాలని అనేది నిర్ణయం తీసుకుంటామని, పార్టీ అధినేత్రి మాయావతితో ఇంకా మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ దేశంలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, మా స్నేహం తెలంగాణ ను పూర్తిగా మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

2019 పార్లమెంటు ఎన్నికల సమయంలోనే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను నాగర్ కర్నూల్ ఎంపి స్థానం నుంచి కెసిఆర్ పోటీ చేయమన్నట్టు అప్పట్లో ఉహాగానాలు వచ్చాయి. అప్పుడు ఆయన సున్నితంగా తిరస్కరించారని స్వేరోస్ వర్గాలు చెప్పుకునేవి. జాతీయ సమీకరణాల దృష్ట్యా రెండు పార్టీలకు బిజెపి, కాంగ్రెస్ లతో వైరం ఉన్న నేపథ్యంలో పొత్తు కుదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ స్థానం నుంచి ఎంపికి పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించారు. BSPకి ఎన్ని సీట్లు కేటాయిస్తారో చూడాలి. పొత్తులపై చర్చలు జరుగుతుండగానే మరోవైపు మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి (సిట్టింగ్ ఎంపీ) ని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రకటించారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్