Tuesday, March 10, 2026
HomeTrending NewsBRS: బీఆర్ఎస్ లో చేరిన చంద్రపూర్ నేతలు

BRS: బీఆర్ఎస్ లో చేరిన చంద్రపూర్ నేతలు

బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి, వేర్వేరు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, సామాజిక సంస్థల నేతలు, ప్రజా ప్రతినిధులు, మేధావులు బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి, అధినేత పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంగళవారం పార్టీలో చేరినవారిలో.. చంద్రాపూర్ జిల్లా సిడిసిబి బ్యాంక్ మాజీ డైరెక్టర్, జిల్లా సహకారి బోర్డ్ ఉపాధ్యక్షులు, ఎన్సీపీ బరోరా పూర్వ అధ్యక్షులు వసంత్ మరోట్ రావ్ విధాతే, దివంగత మాజీ మంత్రి వామన్ రావు గదంవార్ సోదరుడు, సహోలీ చంద్రాపూర్ జెడ్పీ సభ్యులు సతీష్ గదంవార్, పత్రికా ఎడిటర్, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ అధ్యక్షులు ఆశీష్ ఘూమే, చంద్రాపూర్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల నేత అమిత్ దేవ్ రావ్ కంకే, భద్రావతి నగర్ పరిషత్ సేవక్ రాహూల్ సొంటక్కే, గోర్దా మాజీ సర్పంచ్ మనోహర్ డోర్లికార్, ఆనంద్ యెంగ్నే, ఆనంద్ టెంగ్నే, గణేష్ కేశవరావ్ చౌదరి, నందకిషోర్ ఎలాంటివార్, నాగపూర్ డివిజన్ నుంచి.. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్పీఐ జిల్లా అధ్యక్షుడు నరహరి బాహు గవాయి, బుల్దానా జిల్లా పరిషత్ ఛైర్మన్ శాంబావు హతాడే, బాలాసాహెబ్ దామోదర్, రూపేష్ కుమార్ గవాయి, విష్ణు పాటిల్, ఎ.బాలచందర్ తదితరులు పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ నేతలు బాల్క సుమన్ జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular