Saturday, January 18, 2025
Homeసినిమాసమ్మతమే నుండి `బుల్లెట్ లా` సాంగ్ విడుద‌ల‌

సమ్మతమే నుండి `బుల్లెట్ లా` సాంగ్ విడుద‌ల‌

Another Bullet song: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విలక్షణమైన సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. త‌ను ఇప్పుడు అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న “సమ్మతమే” అనే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. టైటిల్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను పెంచాయి. మొదటి సింగిల్  లిరికల్ వీడియో కూడా చార్ట్‌బస్టర్‌గా మారింది. ఈ రోజు  రొమాంటిక్ మెలోడీగా రూపొందిన `బుల్లెట్ లా` లిరికల్ వీడియోను ఆవిష్కరించారు.

శేఖర్ చంద్ర త‌న వాద్య‌సంగీతంతో ఆక‌ట్టుకునేలా చేశాడు.  కిరణ్, చాందిని ఆకర్ష‌ణీయంగా కనిపిస్తున్నారు.  దర్శకుడు గోపీనాథ్ రెడ్డి డిఫరెంట్ లవ్ స్టోరీతో వచ్చిన ఆయన సంగీతంలో మంచి అభిరుచి ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి సింగిల్ లాగానే ఇది కూడా హిట్‌గా నిలుస్తుంది. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె ప్రవీణ నిర్మించిన “సమ్మతమే” ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్