Saturday, February 22, 2025
HomeTrending Newsహెటిరోలో నోట్ల కట్టలు

హెటిరోలో నోట్ల కట్టలు

హెటిరోలో తవ్విన కొద్ది బయటపడుతున్న నోట్ల కట్టలు. 16 లాకర్లను ఓపెన్‌ చేసిన ఐటీ అధికారులు. హైదరాబాద్ లోని అమీర్‌పేట్, సికింద్రాబాద్, శ్రీనగర్‌ కాలనీలో లాకర్లను తెరిచిన ఐటీ అధికారులు. ప్రైవేట్‌ లాకర్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకోగా 16 ప్రైవేట్‌ అల్మార్లను తెరిచిన ఐటీ శాఖ అధికారులు. ఒక్కొక్క అల్మారలో రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్ల నగదు గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు. అల్మార్లల్లోని రూ.30 కోట్ల నగదు సీజ్‌ చేసిన ఐటీ. ఇప్పటికే రూ. 142 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆరు రోజుల ఐటీ దాడుల్లో రూ.172 కోట్ల నగదు సీజ్‌ చేయగా రూ.550 కోట్ల అనుమానిత లావాదేవీలపై అధికారుల ఆరా తీస్తున్నారు. కంపెనీ డబ్బులతో భారీగా భూములు కొనుగోలు చేసిన యాజమాన్యం. ఈ నెల 20వ తేది లోపు ఆదాయపన్ను శాఖ ఎదుట హాజరవ్వాలని నోటీసులు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్