విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘లైగర్‘ నేడు విడుదలైంది. పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని డిఫరెంట్ గా ప్రమోట్ చేయడం.. ట్రైలర్ యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక్క తెలుగులోనే కాకుండా ఇండియా వైడ్ అలాగే ఓవర్ సీస్ లోనూ భారీ ఓపెనింగ్ రాబట్టింది.
ఇదిలా ఉంటే.. లైగర్ స్టోరీ వెనుక అసలు సీక్రెట్ ను పూరి బయటపెట్టారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుకుమార్.. పూరి జగన్నాధ్ ని ఇంటర్ వ్యూ చేశారు. ఈ ఇంటర్ వ్యూలో పూరి, సుక్కు పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. అసలు విషయానికి వస్తే.. లైగర్ కథకి ఇన్ స్పిరేషన్ ఎవరు..? అసలు ఈ కథ ఎలా పుట్టింది..? అని సుకుమార్ పూరిని అడిగితే.. ఒకసారి బన్నీ నాతో మాట్లాడుతూ హీరోకి ఏదైనా ఒక లోపం పెట్టి, అతని పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేయవచ్చును కదా అని బన్నీ అన్నాడు.
హీరోకి నత్తి ఉన్నట్టుగా చూపిస్తే ఎలా ఉంటుందని అడిగితే సూపర్ గా ఉంటుందని అన్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని అనుకున్నప్పుడు ఈ బాక్సింగ్ కథ వైపు వెళ్లాను. విజయ్ దేవరకొండ పాత్రకి నత్తి పెట్టాను. అలా ఈ పాత్రను డిజైన్ చేయడం వెనుక బన్నీ ఉన్నాడని చెప్పాడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.
Also Read : ‘లైగర్’ ఫుల్ మాస్ మూవీ .. పగిలిపోద్ది: అనన్య పాండే