Thursday, March 12, 2026
Homeసినిమాబన్నీ భావోద్వేగం

బన్నీ భావోద్వేగం

Emotional Bunny: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే వసూళ్లు 280 కోట్లు దాటిపోయాయి. ఈ నేపథ్యంలోనే సినిమా థ్యాంక్ యూ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు. పుష్ప సినిమా విడుదలై సంచలన విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు. తన కెరీర్లో సాధించిన విజయంలో సుకుమార్ పాత్ర ఎంతో ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

అల్లు అర్జున్ మాట్లాడుతూ “ఈ రోజు సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నా కెరీర్లో ఆర్య అనేది ఒక మైలురాయి.. సుకుమార్ లేకపోతే ఆర్య లేదు.. ఆర్యా లేకపోతే నేనులేను.. ఈ రోజు నా కెరీర్ ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం సుకుమార్ అని గర్వంగా చెబుతాను. సుకుమార్ నాకు మంచి స్నేహితుడు. ఇక సినిమా విషయానికి వస్తే.. హిట్ అయినా.. ఫ్లాప్ అయినా థాంక్యూ మీట్ అనేది ఖ‌చ్చితంగా పెడతాను. ఎందుకంటే ఫలితంతో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా కష్టపడేది అంతా సమానంగానే ఉంటుంది. థాంక్యూ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. పుష్ప సినిమా కోసం అహర్నిశలు కష్టపడిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నాతో పాటు నటించిన నటీనటులకు.. సినిమా కోసం అడవుల్లో సైతం లెక్క చేయకుండా కష్టపడిన టెక్నికల్ టీమ్, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పుష్ప సినిమాను ఇంత బాగా ఆదరించినందుకు మరొకసారి తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ సినీ అభిమానులు అంద‌రికీ థాంక్యూ” అన్నారు.

Also Read : అల్లు అర్జున్ ‘పుష్ప’పై క‌ర‌ణ్ జోహార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular