Saturday, January 18, 2025
Homeసినిమాపుష్ప 2 లో సింహం తో బ‌న్నీ ఫైట్

పుష్ప 2 లో సింహం తో బ‌న్నీ ఫైట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన పుష్ప సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. బాలీవుడ్ లో మాత్రం 100 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేయ‌డం విశేషం. దీంతో ‘పుష్ప 2’ పై ఆకాశ‌మే హ‌ద్దు అనేలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఈ మూవీని భారీ బ‌డ్జెట్ తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను నిర్మిస్తుంది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్.

పుష్ప 2 కోసం  మరికొన్ని కొత్త పాత్రలను క్రియేట్ చేశారు. ఆ పాత్ర‌ల కోసం వివిధ భాషల నుంచి ఆర్టిస్టులను తీసుకుంటున్నారు. పుష్ప సినిమాలో అడవి నేపథ్యంలోని జంతువులను.. పాములను చూపించకపోవడం ఒక లోపంగా చెప్పుకున్నారు కానీ. ఇంకా చెప్పాలంటే.. క‌థ‌లో ఏ లోపం లేకుండా ప‌ర్ ఫెక్ట్ అనేలా స్టోరీని లాక్ చేశార‌ని టాక్. ఈసారి అడవిలో హీరో ఒక సింహంతో తలపడనున్నాడని తెలిసింది. థాయ్ ల్యాండ్ ఫారెస్టులో ఈ సన్నివేశాన్ని ఒక రేంజ్ లో చిత్రీకరించడానికి రెడీ అవుతున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తన ఇంట్రడక్షన్ సీన్లోనే పులితో తలపడతాడు. ఆ సీన్ ఆ కథను ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది. ఆ స్థాయిలో సింహంతో బన్నీ తలపడే సీన్ ఉంటుందని చెబుతున్నారు. విజయ్ సేతుపతి, అర్జున్ కపూర్ కూడా ఈ సినిమాలో జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రేక్ష‌కులు, అభిమానులు ఎన్ని అంచ‌నాల‌తో వ‌చ్చినా.. అంత‌కు మించి అనేలా పుష్ప 2 ను రెడీ చేస్తున్నారు మేక‌ర్స్.

Also Read : ‘పుష్ప-2’ రిలీజ్ కూడా డిసెంబర్ లోనే?

RELATED ARTICLES

Most Popular

న్యూస్