డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. రామ్ చరణ్ తో ‘ధృవ’ ను తెరకెక్కించారు. ఆ సినిమా సక్సెస్ కావడంతో చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ అవకాశం దక్కింది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన సైరా తెలుగులో ఆకట్టుకున్నప్పటికీ.. మిగిలిన భాషల్లో మాత్రం ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన మూవీ ‘ఏజెంట్’. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది.
ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి నెక్ట్స్ మూవీ అల్లు అర్జున్ తో చేయనున్నారని వార్తలొచ్చాయి. గతంలో వీరిద్దరూ ‘రేసుగుర్రం’ చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు కానీ.. కుదరలేదు. అయితే.. బన్నీకి ఇటీవల సూరి స్టోరీ లైన్ చెప్పాడని.. అది అంతగా ఆకట్టుకోకపోవడంతో నో చెప్పాడని వార్తలొస్తున్నాయి. మరో హీరో కోసం కథను రెడీ చేస్తున్నాడట.
ఇంతకీ ఎవరా హీరో అంటే నితిన్ అని వినిపిస్తుంది. సైరా నరసింహారెడ్డి తర్వాతే సురేందర్ రెడ్డి నితిన్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఆతర్వాత అలాంటిది ఏమీ లేదు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. అందరూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అందుచేత సురేందర్ రెడ్డి నితిన్ తో సినిమా చేయడం కోసం పక్కా మాస్ స్టోరీ రెడీ చేస్తున్నారట. నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్ లో మూవీ, వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. అందుచేత నితిన్ తో ప్రాజెక్ట్ ఓకే అయినా సెట్స్ పైకి రావడానికి టైమ్ పడుతుంది. మరి.. నితిన్ అయినా సురేందర్ రెడ్డితో మూవీ చేయడానికి సై అంటాడో నో అంటాడో..?