Sunday, September 22, 2024
Homeసినిమాసరికొత్త రికార్డ్ సెట్ చేసిన 'బిజినెస్ మేన్'

సరికొత్త రికార్డ్ సెట్ చేసిన ‘బిజినెస్ మేన్’

మహేష్‌ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘బిజినెస్ మేన్’. ఇందులో మహేష్‌ బాబుకు జంటగా కాజల్ అగర్వాల్ నటించింది. పోకిరి తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన బిజినెస్ మేన్ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే బిజినెస్ మేన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బిజినెస్ మేన్ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటలోనే అన్ని టిక్కెట్లు అయిపోయాయి అంటే.. బిజినెస్ మేన్ చిత్రానికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

బిజినెస్ మేన్ సినిమా రీ రిలీజ్ తో కొత్త రికార్డ్ క్రియేట్ చేయాలనేది సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరిక. ఆ కోరిక నెరవేరిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి ఇంతలా క్రేజ్ రావడం చూసి డిస్ట్రిబ్యూటర్స్ సైతం షాక్ అవుతున్నారు. మొదటి రోజు అక్షరాలా 5 కోట్ల 30  లక్షల గ్రాస్ సాధించి ఆల్ టైం రికార్డు సాధించింది. నైజామ్ లో అత్యధికంగా 2 కోట్ల 50 లక్షలు రావడం అరుదైన ఘనత. దీంతో ఇప్పటివ వరకు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న 4 కోట్ల 14 లక్షలు కలెక్ట్ చేసిన ఖుషి చిత్రం రెండో స్థానానికి వెళ్ళింది.

ఆతర్వాత వరసగా సింహాద్రి 4 కోట్లు, జల్సా3 కోట్ల 20 లక్షలు, ఒక్కడు 2 కోట్లు, ఈ నగరానికి ఏమైంది 1 కోటి 76 లక్షలు, పోకిరి 1 కోటి 72 లక్షలు , ఆరంజ్ 1 కోటి 52 లక్షలు, దేశముదురు 1 కోటి 50లక్షలతో మిగిలిన ర్యాంకుల్లో ఉన్నాయి. సూర్య సన్ అఫ్ కృష్ణన్ అనూహ్యంగా ఈ లిస్టులో 1 కోటి 45 లక్షలతో చివరిగా నిలిచింది. మొత్తానికి బిజినెస్ మెన్ రీ రిలీజ్ చేయాలి అనుకునే సినిమాలకు, అలాగే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి జోష్ తీసుకువచ్చింది. మరి.. బిజినెస్ మేన్ సెట్ చేసిన రికార్డును ఏ సినిమా క్రాస్ చేస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్