Saturday, November 23, 2024
HomeTrending NewsYSRCP: కార్యక్రమాల షెడ్యూల్ ఇచ్చిన జగన్

YSRCP: కార్యక్రమాల షెడ్యూల్ ఇచ్చిన జగన్

రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో జరగనున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయాత్తం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నడుం బిగించారు. నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్సార్సీపీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రసంగించిన జగన్ దసరా తర్వాత ప్రభుత్వం, పార్టీ పరంగా చేపట్టబోయే కార్యక్రమాలపై నేతలకు వివరించారు.  మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకూ పార్టీ యంత్రాంగాన్ని క్రియాశీలకంగా వ్యవహరించాలని ఉద్భోదించారు.

  • సెప్టెంబర్ 30న ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్షా క్యాంపైన్ నవంబర్ 10 వరకూ
  • నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 10 వరకు 40 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి (Why AP Needs Jagan)
  • అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు దాదాపు 60 రోజుల పాటు.. మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు
  • డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు ఆడుదాం ఆంధ్రా
  • జనవరి 1 నుంచి వృధ్ధాప్య పెన్షన్ పెంపు
  • జనవరి 10 నుంచి 20 వరకు వైఎస్సార్ చేయూత..
  • జనవరి 20 నుంచి 30 వరకు వైఎస్సార్ ఆసరా
  • ఫిబ్రవరిలో మ్యానిఫెస్టోను ప్రజలకు తీసుకుని వెళ్లే కార్యక్రమం
RELATED ARTICLES

Most Popular

న్యూస్