Saturday, January 18, 2025
Homeసినిమా'తంత్ర'పై పెరుగుతున్న క్రేజ్!

‘తంత్ర’పై పెరుగుతున్న క్రేజ్!

గతంలో ప్రేక్షకులను భయపెట్టడానికి దెయ్యాల సినిమాలు తప్ప మరో మార్గం ఉండేది కాదు. హారర్ థ్రిల్లర్ జోనర్ అనగానే దెయ్యాలు ఆవహించడం .. అవి నానాగందరగోళం చేస్తూ, తెరపై ఇతర పాత్రలను .. ప్రేక్షకులను భయపెట్టడం జరుగుతూ వచ్చింది. ఈ తరహా కథలను ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు గనుక, బడ్జెట్ పరంగా ఒక బంగ్లాకి పరిమితమవుతూ వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో తాంత్రిక శక్తుల నేపథ్యంలో కథలకు డిమాండ్ పెరుగుతూ రావడం గమనించవచ్చు.

అయితే గతంలోనూ క్షుద్ర శక్తుల నేపథ్యంలో వచ్చిన ‘తులసిదళం’ .. ‘కాష్మోరా’ వంటి కథలకు కూడా మంచి ఆదరణ లభించింది. ఆ తరువాత అలాంటి కథలు పెద్దగా రాలేదు. కానీ ఆ మధ్య వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ సినిమా ఇలాంటి కాన్సెప్ట్ నే  టచ్ చేసి,  ఘనవిజయాన్ని సాధించింది. ఆ తరువాత వచ్చిన సీక్వెల్ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ తరహా కథల్లో కదలిక మొదలైంది. ఆ ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్న మరో సినిమానే ‘తంత్ర’.

అనన్య నాగళ్ల ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించాడు. నరేశ్ బాబు – రవి చైతన్య నిర్మించిన ఈ సినిమా, క్షుద్ర ప్రయోగం నేపథ్యంలో నడుస్తుంది. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ కథపై, అందరిలో ఆసక్తి ఉంది. ట్రైలర్ రిలీజ్ తరువాత ఈ సినిమాపై ఒక్కసారిగా బజ్ పెరిగిపోయింది. రేపు థియేటర్లకు వస్తున్న ఈ సినిమా, ‘మా ఊరి పొలిమేర’ తరహాలో ఆడియన్స్ ను మెప్పిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్