Sunday, January 19, 2025
Homeసినిమాబాలకృష్ణతో ‘రామానుజాచార్య’ బయోపిక్

బాలకృష్ణతో ‘రామానుజాచార్య’ బయోపిక్

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి.  మలినేని గోపీచంద్ దర్శకత్వంలో  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని  సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. నెక్ట్స్ మూవీని బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్నారు. ఈరోజు ప్రారంభమైన ఈ చిత్రాన్ని 2023 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. అయితే… బాలకృష్ణ మరో సినిమాకి ఓకే చెప్పారని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలయ్యతో ‘రామానుజాచార్య’ ప్రాజెక్ట్ ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ తెలియచేశారు.

ఈ నెల 9న సి.కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ… బాలకృష్ణతో చేయనున్న సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఓ అంతర్జాతీయ సంస్థ, రవి కొట్టారకరతో కలసి చినజీయర్ స్వామి వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. కళ్యాణ్ అమ్యుస్మెంట్ పార్క్ ఇనాగరేషన్ రోజున ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ అనుకుంటున్నాం. కళ్యాణ్ అమ్యుస్మెంట్ పార్క్ నిర్మించడం దేవుడు ఇచ్చిన వరం అన్నారు. రామానుజాచార్య బయోపిక్ చేస్తున్నామని ప్రకటించారు కానీ.. దర్శకుడు ఎవరు అనేది మాత్రం అనౌన్స్ చేయలేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్