Sunday, February 23, 2025
HomeTrending Newsకేబినేట్ భేటీ 7కు వాయిదా

కేబినేట్ భేటీ 7కు వాయిదా

Cabinet Meet: ఈనెల 3న జరగాల్సిన రాష్ట్ర కేబినేట్ సమావేశం 7వ తేదీకి వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి ఎల్లుండి గురువారం ఉదయం 11 గంటలకు కేబినేట్ సమావేశం, సచివాయలం 1వ అంతస్తులోని కేబినేట్ సమావేశ మందిరంలో జరగాల్సి ఉంది. కానీ అదే రోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పెద్ద కర్మ ఉండడంతో మంత్రులు ఆ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించారు. దీనితో కేబినేట్ భేటీని వాయిదా వేశారు.

కాగా, రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు 7వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. మొదటి రోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. అనంతరం 11 గంటలకు కేబినేట్ భేటీ జరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్