మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరుగుతోన్న శాసనమండలి ఎన్నికల పోలింగ్ ఎల్లుండి జరగనుంది. ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రంతో ముగిసింది.
- ఉత్తరాంధ్ర …. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం
- తూర్పు రాయల సీమ- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు
- పశ్చిమ రాయలసీమ- కర్నూలు, కడప, అనతపురం
జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు…
- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు…
- కడప-అనంతపురం-కర్నూలు
జిల్లాల ఉపాద్యాయ నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఉత్తరాంధ్ర నియోజకవర్గానికి వైసీపీ-సీతంరాజు సుధాకర్; టిడిపి-వేపాడ చిరంజీవి రావు; బిజెపి తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పోటీ చేస్తున్నారు.
తూర్పు రాయల సీమ నుంచి వైసీపీ అభ్యర్ధిగా పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, టిడిపి నుంచి కంచర్ల శ్రీకాంత చౌదరి, బిజెపి తరఫున సన్నా రెడ్డి దయాకర్ రెడ్డిలు పోటీలో ఉన్నారు.
పశ్చిమ రాయలసీమ నుంచి వైసీపీ- వెన్నపూస రవీంద్రా రెడ్డి, బిజెపి- యెన్. రాఘవేంద్ర, టిడిపి- భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డిలని బరిలోకి దించింది.
ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో తూర్పు రాయలసీమ నుంచి -8; పశ్చిమ రాయలసీమ నుంచి 17మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.
ఓట్ల లెక్కింపు గురువారం మార్చి 16 న జరుగుతుంది.