Wednesday, March 18, 2026
Homeసినిమా‘క్యాసెటు గోవిందు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

‘క్యాసెటు గోవిందు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

పాత చెప్పులు, నలిగిన షర్ట్, ఫ్యాంట్, సైకిలు…దాని క్యారేజ్ కి టీవీ ఇలా సరికొత్త లుక్కుతో తొలి పరిచయంతో దాసరి రాజు విమల్ హీరోగా, ‘క్యాసెటు గోవిందు’ అనే టైటిల్ తో ముందుకు వచ్చారు. వినాయక చవితి సందర్భంగా విడుదల అయిన ఈ పోస్టర్ కి మంచి స్పందన లభించింది. ఒక పల్లెటూరు కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విరాజ్ వర్ధన్ దర్శకత్వం వహించగా, అనంత లక్ష్మీ కె సమర్పణలో మెక్బుల్ పిక్చర్స్ పై మణిధర్ కె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పశ్చిమగోదావరి జిల్లాలో త్వరలో మొదలు కాబోతోంది. ‘అశ్వత్థామ’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పరశురాం శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తున్నారు. కేమెరా-త్రిలోక్ సిద్దు; సంగీతం- ఎలీషా ప్రవీణ్ అందిస్తున్నారు.

నిర్మాత మణిధర్ మాట్లాడుతూ “ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన లభించింది, కొత్తవాళ్ళకి ఇండస్ట్రీ వెల్కమ్ చెప్పినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, ఇదే ఉత్సహంతో సినిమాని కూడా తెరకెక్కిస్తాం. త్వరలో మీ ముందుకు వస్తాం” అని తెలిపారు. ఈ చిత్రానికి సహాయ రచన : మౌనిక వూరిటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular