Friday, November 22, 2024
HomeTrending Newsకుల గణనతో వెనుకబడిన వర్గాలకు మరింత మేలు: స్పీకర్ తమ్మినేని

కుల గణనతో వెనుకబడిన వర్గాలకు మరింత మేలు: స్పీకర్ తమ్మినేని

కుల గణన చేయాలని సిఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో బీసీలకు మరింత మేలు జరగుతుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో విద్య, వైద్య ఆరోగ్యం వంటి అనేక ప్రాధాన్య రంగాలను నిర్వీర్యం చేశారని, జగన్ ముఖ్యమంత్రి కాగానే అన్ని రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ సామాజిక విప్లవం తీసుకువచ్చారని వివరించారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధిలోని బొద్దాం గ్రామాంలో అశేష జనవాహిని మధ్య జైత్రయాత్రగా సాగింది.  రాజాం జంక్షన్ లో ఏర్పాటుచేసిన బహిరంగసభకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, శంబంగి చిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, ధర్మాన కృష్ణదాస్, కళావతిలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ వైసీపీ పాలనపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు సామాజిక సాధికార జైత్రయాత్ర ద్వారా ప్రజలు సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. జనప్రవాహంలా బస్సుయాత్ర సభకు ప్రజలు తరలిరావడం జగన్ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణకు నిదర్శనమన్నారు. తాండ్ర పాప రాయుడు పుట్టిన గడ్డ కాబట్టి ఈ ప్రాంతాల్లో అన్యాయాలు చేసిన వారిపై తిరగబడి ప్రజలు వైసీపీని గెలిపించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని గుర్తించి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారని, అయినా సరే ఆ పార్టీ శ్రేణులు కడిగిన ముత్యం అంటూ చెప్పుకోవడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్తపేటలో 

సామాజిక సాధికార యాత్ర ఈ రాష్ట్రంలోనే కాదని, దేశంలోనే చారిత్రాత్మకమైనదని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. గత పాలకుడు ఏ సామాజిక వర్గాలనైతే దగా చేశాడో, మోసం చేశాడో, అబద్దాలతో ముంచాడో మనకు తెలుసని,  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మాటలతో గాయపరిచిన కఠినాత్ముడు బాబు అని మండిపడ్డారు. అణగారిన వర్గాలను చులకనగా చూసిన దొంగనాయకుడని ఘాటుగా విమర్శించారు. కోనసీమలోని కొత్తపేటలో సామాజిక సాధికార బస్సుయాత్ర సాగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు తరలివచ్చారు. జగనే మా నమ్మకం అంటూ… నినదించారు. కొత్తపేట శాసనసభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు, ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, చింతా అనురాధ, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు కన్నబాబు, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చెల్లుబోయిన మాట్లాడుతూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ వారిని తన అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని,  ఆయా వర్గాల వారికి చేయూత నివ్వడానికి అనేక సంక్షేమపథకాలు తెచ్చారని వివరించారు. రుగా పేదలకు డబ్బు అందేలా డీబీటీ ద్వారా 2.36 కోట్లను అకౌంట్లలో వేశారని, ఇక నాన్‌ డీబిటీ ద్వారా మరో 2లక్షలపైగా కోట్లను అందించారని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్