Sunday, January 19, 2025
HomeTrending NewsAP Genco:సీలేరు పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌

AP Genco:సీలేరు పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌

విద్యుదుత్పాదన రంగంలో ఏపీ జెన్‌ కో మరో మైలురాయిని చేరనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజి ప్లాంటు (పీఎస్పీ) నిర్మాణానికి కేంద్ర విద్యుత్‌ మండలి (సీఈఏ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈనెల ఆరో తేదీన ఢిల్లీలో సీఈఏ ఛైర్మన్‌ ఘన శ్యామ్‌ ప్రసాద్‌ నేతృత్వంలోని కార్యవర్గ సభ్యులతో ఏపీ జెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు, చీఫ్‌ ఇంజినీరు (హైడల్‌) సుజయ్‌ కుమార్, సూపరింటెండింగ్‌ ఇంజినీరు రవీంద్రారెడ్డి సమావేశమై ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజంజేషన్‌ ఇచ్చారు. 150 మెగావాట్ల సామర్థ్యం గల తొమ్మిది యూనిట్లను మొత్తం (1350 మెగావాట్ల) పీఎస్పీ నిర్మించాల్సిన అవసరం, రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితులను జెన్‌కో ఎండీ విశదీకరించారు. దీనిని సావధానంగా విన్న సీఏఈ ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆవశ్యకతను గుర్తించింది. ఇందులో భాగంగానే దీనిని నిర్మించుకునేందుకు ఆమోదం తెలియజేసింది. ఈమేరకు ఈ పీఎస్పీ నిర్మాణానికి అనుమతించినట్లు మంగళవారం సీఈఏ అధికారులు ఏపీ జెన్‌కోకు సమాచారం పంపించారు.

కేంద్ర ప్రభుత్వం అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా విధానాలను సరళీకరించింది. సరళీకరించిన విధానం ప్రకారం 90 రోజుల్లో అనుమతించాల్సి ఉండగా అప్పర్‌ సీలేరు పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టుకు మాత్రం 70 రోజుల రికార్డు సమయంలోనే సీఈఏ సమ్మతి లభించింది. ఈ ప్రాజెక్టును ఏపీ జెన్‌కో నిర్మించనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్