Saturday, March 14, 2026
HomeTrending Newsరాష్ట్రాలపై కేంద్రం పెత్తనం

రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం

రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించినట్లే అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్. అంబేద్కర్ చెప్పింది ఇదే అని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎస్సీ, ఎస్టీ మేధావుల జాతీయ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ భారత దేశం అంటే రాష్ట్రాల సమూహం అని, మనది ఫెడరల్ వ్యవస్థ కలిగిన దేశమని పేర్కొన్నారు. రాష్ట్రాల ఆర్థిక స్వావలంబనను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. రాజ్యాంగం స్ఫూర్తిని తూట్లు పొడుస్తూ దేశంలోని పాలకులు అవలంభిస్తున్న ధోరణిని ఎండగట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటిని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఉద్యోగాలను హరించే చర్యలు జోరుగా సాగుతున్నాయని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఏమాత్రం మంచిది కాదన్నారు. రాజ్యాంగంలోని సోషలిస్ట్ ప్రియంబుల్ కు భిన్నంగా
కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరునిపై ఉందన్నారు. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందని, దాని కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మేధావులు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవగాహన శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.

బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బీ ఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మహా జ్ఞాని అని, ఆయనను ఒక వర్గానికి పరిమితం చేసేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ మేధావుల ఫోరం రాష్ట్ర చైర్మన్ ఆరేపల్లి రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫోరం జాతీయ నాయకులు మురళీ దర్శన్, నర్సింహా, బ్రాహ్మనాథరావు, భవాని, మాధవీ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular